తెలుగు అక్షరాలతో చీర | - | Sakshi
Sakshi News home page

తెలుగు అక్షరాలతో చీర

Sep 4 2026 2:18 AM | Updated on Sep 4 2026 2:18 AM

బాసర: సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు నల్ల జగదీశ్వర్‌ రూపొందించిన తెలుగు అక్షరాల చీరను బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారికి శుక్రవారం సమర్పించనున్నారు. జగదీశ్వర్‌ ఈ చీరను స్వయంగా నేశాడు. తెలుగుభాషపై ఉన్న అభిమానం, చేనేత కళపై తనకున్న ఆసక్తికి ప్రతీకగా చీర నేసినట్లు తెలిపాడు. అమ్మవారికి సమర్పించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నాడు. తెలుగు అక్షరాలతో రూపొందించిన చీర భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఉన్నత లక్ష్యాలు సాధించాలి

ఎల్లారెడ్డిపేట: మండలకేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్‌ డే వేడుకల నిర్వహించారు. జిల్లా కో– ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ సుష్మిత హాజరయ్యారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

డివైడర్‌ను ఢీకొట్టిన వ్యాన్‌

బోయినపల్లి: కరీంనగర్‌–సిరిసిల్ల ప్రధాన రహదారిలో మండలంలోని వెంకట్రావుపల్లి పరిసరాల్లో ఓ డీసీఎం వ్యాన్‌ గురువారం డివైడర్‌పైకి దూసుకెళ్లింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల నుంచి కరీంనగర్‌ వైపు వెళ్తున్న వ్యాన్‌ అదుపు తప్పడంతో డివైడర్‌పైకి దూసుకెళ్లింది. కొంత మేర డివైడర్‌ దెబ్బతినడంతోపాటు వాహనం ముందు భాగం దెబ్బతింది.

దరఖాస్తులు ఆహ్వానం

సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలోని అర్బన్‌ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలలో గెస్ట్‌ టీచర్‌ హిందీ, పీఈటీ, అకౌంటెంట్‌, అసిస్టెంట్‌ కుక్‌, స్కావెంజర్‌, క్లీనింగ్‌ పర్సన్‌ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య ప్రకటనలో కోరారు. గెస్ట్‌ టీచర్‌ హిందీకి ఎంఏ బీఈడీ, పీఈటీకి ఇంటర్‌ లేదా డి.పి.ఈ.డి అర్హత ఉండాలని పేర్కొన్నారు. అకౌంటెంట్‌కు డిగ్రీతోపాటు ట్యాలీలో అనుభవం ఉంటే ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అసిస్టెంట్‌ కుక్‌కు పదో తరగతి ఉత్తీర్ణులు, 18 నుంచి 44 ఏళ్లు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సిరిసిల్లలోని అర్బన్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో సమర్పించాలని, పూర్తి వివరాలకు 81256 58243లో సంప్రదించాలని కోరారు.

వృద్ధుని ఆత్మహత్య

కోనరావుపేట(వేములవాడ): ఒంటరితనం భ రించలేక ఓ వృద్ధుడు బలవన్మరణానికి పాల్ప డ్డాడు. కోనరావుపేట మండలం రామన్నపేటకు చెందిన నేతుల రాజయ్య(80) సుతారి కార్మికుడిగా పనిచేసేవాడు. రాజయ్య భార్య లచ్చవ్వ, కుమారుడు దశరథం కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లకు వివాహం చేసిన రాజయ్య కొంతకాలంగా ఒంటరితనంతో బాధపడుతున్నాడు. బుధవారం రాత్రి ఆత్మహత్యకు ప్రయత్నించగా సర్పంచ్‌ లక్ష్మి భర్త రాజశేఖర్‌రెడ్డి అడ్డుకొని ఇంటికి పంపించాడు. మళ్లీ గురువారం తెల్లవారుజామున గ్రామశివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. కోనరావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బీజేపీ నాయకుల అరెస్టు

ఇల్లంతకుంట: రాష్ట్ర బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్‌ నాయకుల దాడి, సంత్‌ రవిదాస్‌ చిత్రపటానికి నల్ల రంగు వేయడాన్ని నిరసిస్తూ మండలకేంద్రంలో గురువారం మండల బీజేపీ కార్యకర్తలు సీఎం దిష్టిబొమ్మ దహనం చేసేందకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఉపేంద్ర చారి, ఎస్సై 2 లక్పతి సిబ్బందితో అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మామిడి హరీశ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు భూమళ్ల అనిల్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి కరికె నవీన్‌కుమార్‌, అసెంబ్లీ కో కన్వీనర్‌ బత్తిని స్వామి పాల్గొన్నారు.

రెడ్డి కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలి

బోయినపల్లి: రాష్ట్రంలో పేద రెడ్లకు ఉపాధి అవకాశాల కల్పనకోసం ఏర్పాటు చేస్తామన్న రెడ్డి కార్పొరేషన్‌కు వెంటనే నిధులు విడుదల చేయాలని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈనెల 8న హైదరాబాద్‌లో జరిగే రెడ్డిల నిరసన దీక్ష పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement