టాస్క్ శిక్షణ ద్వారా అందరి ఎదుట ధైర్యంగా మాట్లాడడం వచ్చింది. మన ఆలోచనలను స్పష్టంగా చెప్పడం నేర్చుకుంటున్నాం. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం పెరిగింది. భవిష్యత్‌లో ఇంటర్వ్యూలు ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుంది.
– శృతి,
డిగ్రీ విద్యార్థిని
విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యం
విద్యార్థులను విద్యతోపాటు ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా టాస్క్ శిక్షణ ఇస్తున్నాం. మాట్లాడే సామర్థ్యం, వ్యక్తిత్వ వికాసం, ఉద్యోగ ఇంటర్వ్యూలను ఎదుర్కొనే విధానం నేర్పిస్తాం. విద్యా సంవత్సరంలో నాలుగైదు పర్యాయాలు శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. మొదటి దశ ఓరియంటేషన్ ప్రోగ్రాం ముగిసింది. – జనగామ శ్రావణ్‌రావు,
టాస్క్ కో–ఆర్డినేటర్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల
ఉద్యోగ నైపుణ్యాలు అవసరం
విద్యార్థులకు విద్యతోపాటు ఉద్యోగం సాధించే నైపుణ్యాలు అవసరం. ఆ దిశగా టాస్క్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందిస్తున్నాం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు టాస్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కళాశాలలో టాస్క్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.
– విజయలక్ష్మి,
ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల


