తంగళ్లపల్లి: జిల్లాలోని గొర్ల పెంపకందారుల సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని కోరుతూ సంఘం నాయకులు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారికి గురువారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని దాదాపు 250 గ్రామాల్లో 189 సొసైటీలు ఉన్నాయని ఒక్కో సొసైటీలో వంద మందికిపైగా సభ్యులతో కలిపి జిల్లా వ్యాప్తంగా సుమారు 70 వేల మంది గొర్ల పెంపకదారులు, గొల్ల కురుమలు ఉన్నారన్నారు. ఇతర జిల్లాల్లో మాదిరిగానే జిల్లాలోనూ గ్రామాల వారీగా ఎన్నికలు జరిపి కొత్త కార్యవర్గాలను ఎన్నుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు జక్కుల నాగరాజ్ యాదవ్, బండి దేవేందర్ యాదవ్, చీమల ప్రశాంత్ యాదవ్, వేల్పుల శ్రీకాంత్ యాదవ్, సింగర్ వేణి లచ్చయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


