● ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి(చొప్పదండి): పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధితో ప్రభుత్వం అండగా ఉంటుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మందికి రూ.6.97 లక్షల విలువ గల చెక్కులను బుధవారం గంగాధర క్యాంపు కార్యాలయంలో అందించారు. ఏఎంసీ చైర్మెన్ బోయిని ఎల్లేశ్‌యాదవ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్‌యాదవ్, ప్యాక్స్ ఛైర్మన్ దుర్గారెడ్డి, నాయకులు వన్నెల రమణారెడ్డి, పర్లపల్లి వేణుగోపాల్, పులి లక్ష్మీపతి, కల్లెపెల్లి చెంద్రయ్య, మాడిశెట్టి మునీందర్, తిరుపతిరెడ్డి, పురుశోత్తంరెడ్డి,సుదర్శన్, ప్రవీణ్ పాల్గొన్నారు.
రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సర్వాయిపల్లిలో రోవర్ యంత్రాలతో చేపడుతున్న భూముల రీ సర్వేను బుధవారం పరిశీలించారు. రెవెన్యూ, అటవీ భూముల రీ సర్వే వివరాలు తెలుసుకున్నారు. ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, నాయబ్ తహసీల్దార్ వేణు తదితరులు ఉన్నారు.
హక్కుల కోసం ఉద్యమిస్తాం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రెడ్డి సామాజిక వర్గం సమస్యల పరిష్కారం, హక్కుల సాధనకు ఉద్యమిస్తామని రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఒక్క రోజు దీక్షను విజయవంతం చేయాలని కోరారు. ఈనెల 8న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ఒక్క రోజు దీక్ష పోస్టర్‌ను రెడ్డి సంఘం మండల అధ్యక్షుడు కుంభాల సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వేయి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి ట్రస్ట్ కోసం 15 ఎకరాలు కేటాయించగా, ప్రస్తుత ప్రభుత్వం తీసుకోవడం అన్యాయమన్నారు. పారిపల్లి సంజీవరెడ్డి, వంగ శ్రీకాంత్‌రెడ్డి, గుర్రాల చంద్రమోహన్‌రెడ్డి, గోవూరి ప్రదీప్‌రెడ్డి, నేవూరి శ్రీనివాస్‌రెడ్డి, బాపురెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘పల్లె’ పాలనపై సర్పంచులకు పాఠాలు
సిరిసిల్ల: పల్లె పాలన, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంపై మహిళా సర్పంచులకు మూడు రోజుల శిక్షణ హైదరాబాద్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ మానవ వనరుల అభివృద్ధి సంస్థ(డీఎంసీహెచ్‌ఆర్‌డీఏ)లో జరిగింది. గ్రామ సర్పంచుల విధులు, బాధ్యతలు, పంచాయతీరాజ్ చట్టం ఏం చెబుతుందని అనే అంశాలపై మూడు రోజులపాటు పాఠాలు బోధించారు. ఇటీవల కొత్తగా ఎన్నికై న సర్పంచులకు పల్లె పాలనపై అవగాహన కల్పించారు. జిల్లా నుంచి కోనరావుపేట మండలం బావుసాయిపేట సర్పంచ్ షేక్ యాస్మిన్‌పాషా, వేములవాడ రూరల్ మండలం అనుపురం సర్పంచ్ శేర్ల రాజేశ్వరి, చంద్రగిరి సర్పంచ్ ముత్త సంజన, ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లె సర్పంచ్ సునీతలు పాల్గొన్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1, 2 తేదీల్లో శిక్షణను పూర్తి చేసుకున్న సర్పంచ్‌లకు ధ్రువీకరణ పత్రాలను అధికారులు అందించారు.
శిక్షణలో తంగళ్లపల్లి సర్పంచ్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శిక్షణకు తంగళ్లపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం హాజరయ్యారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికపై సర్పంచులకు అవగాహన కల్పిస్తున్నారు.


