● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: చదువుతోపాటు సైబర్ నేరాలు, మోసాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే కోరారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం నర్సింగ్ కాలేజీలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, అదే స్థాయిలో నేరాలు పెరుగుతున్నాయన్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా ద్వారా నకిలీ అకౌంట్లు, ఫేక్ లింకులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, స్కాలర్‌షిప్స్, గిఫ్ట్ ఆఫర్లు, లక్కీ డ్రా పేర్లతో మోసాలు జరుగుతున్నాయన్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వీడియో కాల్స్, సందేశాలు లేదా లింకులను నమ్మొద్దని కోరారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు ఇవ్వద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు.
సైబర్ భద్రత పోస్టర్ ఆవిష్కరణ
వినాయక చవితి సందర్భంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. డీఎస్పీ నా గేంద్రచారి, సీఐ శ్రీనివాస్, సైబర్‌క్రైమ్ ఎస్సై జునైద్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అనిత, సిబ్బంది గంగిరెడ్డి, రాజు, శ్రీకాంత్, విజయ్ ఉన్నారు.


