● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ను ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఈనెల 5, 6, 12, 13 తేదీల్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరీమా అగ్రవాల్ బుధవారం తెలిపారు. బూత్ లెవల్ అధికారులు(బీఎల్‌వో)లు ప్రత్యేక ప్రచార కార్యక్రమం జరిగే రోజుల్లో నిర్ధేశిత పోలింగ్ స్టేషన్‌లలో అందుబాటులో ఉంటారన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు(బీఎల్‌ఏ) ఆ రోజుల్లో హాజరవుతారని వివరించారు. వారి సమక్షంలో ము సాయిదా ఓటరు జాబితాను పరిశీలించి, తప్పులు, సవరణలు, ఇతర లోపాలను గుర్తిస్తారని వివరించా రు. ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు హాజరై ముసాయిదా జాబితాను పరిశీలించవచ్చన్నారు. ఫారం–6, 7, 8 ద్వారా ఓటర్లు తమ అభ్యంతరాలు తెలపవచ్చన్నారు.
సకాలంలో పరీక్షల నివేదికలు అందించాలి
సిరిసిల్ల: సకాలంలో వైద్యపరీక్షల నివేదికలు అందించాలని జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌ను బుధవారం తనిఖీ చేశారు. వివిధ రకాల పరీక్షలు, నమూనాల సేకరణను పరిశీలించారు. టీ–హబ్ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి ఉన్నారు.
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లపై సమీక్ష
జిల్లాలోని మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల(ఎంఎల్‌హెచ్‌పీల) పనితీరుపై డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ సమీక్షించారు. జిల్లాలోని హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్యసేవలు, సాధారణ వ్యాధుల నిర్వహణ, తల్లి–శిశు ఆరోగ్యం, వ్యాధి నిరోధక కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, రికార్డుల నిర్వహణను సమీక్షించారు. ప్రోగ్రాం అధికారులు రామకృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


