వేతన వెతలు
వేములవాడ/వేములవాడరూరల్: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులు జీతాలు అందక ఇబ్బందిపడుతున్నారు. నిత్యం కంపు వాసన మధ్య శ్రమిస్తున్న వీరికి ఇప్పటి వరకు వస్తున్న వేతనంలోనూ కోత విధిస్తున్నారు. దీంతో కార్మికులు వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.
భారంగా జీవితాలు
వేములవాడ మున్సిపాలిటీలో దాదాపు 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారికి రెండు నెలలుగా వేతనాలు అందలేదు. దీంతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, నిత్యావసరాల కొనుగోళ్లు ఇబ్బందిగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పు చేసి కుటుంబ అవసరాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.
జీవో 1181తో కోతలు
చెత్త సేకరించే డ్రైవర్ల వేతనాల్లో కోత విధించడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 1181 విడుదల చేసింది. దీని ద్వారా మున్సిపాలిటీ కార్మికుల వేతనాల్లో భారీగా కోత పడుతుంది. గతంలో ప్రతిరోజూ కష్టపడి పనిచేసే డ్రైవర్లకు నెలకు రూ.20,500 వేతనం లభించేది. కానీ ఈ జీవోతో రూ. 16,600కు తగ్గించేశారు. ఇందులో నుంచే పీఎఫ్ కట్ చేస్తారు. కొందరు కార్మికులకు వెయ్యి నుంచి రూ.3వేల మధ్య వేతన కోత పడుతుంది. ఒక వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే ప్రభుత్వం వేతనాలు తగ్గించడంపై కార్మి కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత పద్ధతి ప్రకారమే వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు.
వేతన కోతలు పడే సిబ్బంది వివరాలు
డ్రైవర్లు 11
కంప్యూటర్ ఆపరేటర్లు 02
వాటర్ సప్లయ్ సిబ్బంది 21


