జోహార్‌ వైఎస్సార్‌ | - | Sakshi
Sakshi News home page

జోహార్‌ వైఎస్సార్‌

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

డీసీసీ ఆఫీసులో నివాళి అర్పిస్తున్న నాయకులు

వేములవాడలో నివాళి అర్పిస్తున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నాయకులు

సిరిసిల్లటౌన్‌/వేములవాడ: పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్సార్‌ పనిచేశారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా వేములవాడ, సిరిసిల్ల పట్టణాల్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. డీసీసీ ఆఫీస్‌లో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ రాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, రాగుల జగన్‌, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు, అలువాల చందు, చొక్కాల రాము, బొప్ప దేవయ్య, మేకల కమలాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement