● జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ
సిరిసిల్ల: జిల్లా కోర్టులో ఈనెల 12న నిర్వహించే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని, పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ కోరారు. జిల్లా కోర్టు సముదాయంలో బుధవారం న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు, ఎకై ్సజ్‌శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా న్యాయమూర్తి నీరజ మాట్లాడుతూ పెండింగ్ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్ జాదవ్, ఎకై ్సజ్ ఎస్‌డీపీఈవో హిమశ్రీ, సిరిసిల్ల, వేములవాడ డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి మేఘన, సీఐలు వెంకటేశ్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.


