నిబంధనల ప్రకారమే.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారమే..

Sep 3 2026 8:29 AM | Updated on Sep 3 2026 8:29 AM

నిబంధనల ప్రకారం అన్ని మున్సిపాలిటీల్లో ఒకేలా ఉండాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1181 ప్రకారం వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. గతంలోని వేతనాల్లో జరిగిన ఆడిట్‌ నిబంధనల ప్రకారం వ్యత్యాసాన్ని సడలించి ఇవ్వడం జరుగుతుంది.

– లోకేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌, వేములవాడ

దుర్వాసన మధ్య డ్యూటీ చేస్తున్నాం

నేను వేములవాడ మున్సిపాలిటీలో ఏడేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. గతంలో రూ.20,500 జీతం వచ్చేది. కొత్త జీవోతో రూ.14,400 చేతికి అందుతున్నాయి. ఇంత నష్టపోతే మేము ఎట్లా బతకాలి. ప్రభుత్వం స్పందించి పాత వేతనాలు ఇవ్వాలి. – ఎడ్ల బాలకృష్ణ, మున్సిపల్‌ డ్రైవర్‌

పాత వేతనం పునరుద్ధరించాలి

ఏళ్లుగా పనిచేస్తున్న మాపై జీవో 1181 తెచ్చి నిలువునా ముంచారు. ప్రభుత్వవిప్‌ ఆది శ్రీనివాస్‌ స్పందించి మా సమస్యను పరిష్కరించాలి. వెంటనే జీవో 1181ను సవరించి పాత జీతం వచ్చేలా చూడాలి.

– పిట్టల రాజశేఖర్‌, మున్సిపల్‌ డ్రైవర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement