పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

Sep 1 2026 3:18 AM | Updated on Sep 1 2026 3:18 AM

ఇద్దరు రిమాండ్‌

సిరిసిల్ల/తంగళ్లపల్లి: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు, రూ.5వేలు జరిమానా విధిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్‌ సోమవారం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ మహేశ్‌ బీ గీతే తెలిపారు. తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మైనర్‌ బాలికను జనగాంకు చెందిన యటెల్లి విజయ్‌ లైంగిక వేధింపులకు గురిచేశారు. బాలిక తల్లి ఫిర్యాదుతో అప్పటి ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నేరం రుజువు కావడంతో నిందితుడైన యేటల్లి విజయ్‌కు 20 ఏళ్ల జైలు, రూ.5000 జరిమాన విధిస్తూ తీర్పు నిచ్చారు. నిందితుడికి శిక్ష పడేందుకు సమన్వయంతో పని చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను ఎస్పీ మహేశ్‌ బీ గీతే అభినందించారు.

మహిళా మావోయిస్టు రాధక్క మృతి

పెద్దపల్లి : మావోయిస్టు పార్టీ సెంట్రల్‌ కమిటీ మాజీ సభ్యుడు పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్‌ చంద్రన్న సహచరి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా కమిటీ సభ్యురాలు కోర్సింగే మోతీబాయి అలియాస్‌ రాధక్క సోమవారం మృతి చెందారని మాజీ మావోయిస్టు తెలిపారు. ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రిలో చికి త్స పొందుతూ సాయంత్రం 5.55 గంటలకు కన్నుమూశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆదిలాబాద్‌ మండలం పిప్పల్‌దరి గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధవులు తెలిపారు. చివరిచూపుకోసం వచ్చేవారు ఆదిలాబాద్‌ నుంచి కలెక్టర్‌ చౌరస్తా మీదుగా ఎస్‌పీ క్యాంప్‌ ఆఫీస్‌ రోడ్డు గుండా అంకోలి గ్రామం మీదుగా పిప్పల్‌ దరికి చేరుకోవాలని వారు సూచించారు.

యువకుడిపై

గొడ్డలితో దాడి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మోతె రాజు(18)పై మా మిడాల రాజు(26) సోమవారం రాత్రి గొడ్డలి తో దాడి చేశాడు. స్థానికుల కథనం ప్రకారం.. మోతె రాజుకు మామిడాల రాజు, మామిడాల అక్కవ్వ(45)లకు మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఈక్రమంలో సోమవారం రాత్రి మోతె రాజు.. మామిడాల రాజు ఇంటికి వెళ్లగా ఆగ్రహించిన రాజు గొడ్డలితో దాడి చేశాడు. గాయపడ్డ మోతె రాజును స్థానికులు 108 ద్వారా సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వీర్నపల్లి: మండలంలో అటవీశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వేముల లక్ష్మణ్‌ తెలిపారు. భూక్య తండా పంచా యతీ పరిధిలోని రాశిగుట్ట తండాకు చెందిన తేజా వత్‌ మోహన్‌, తేజావత్‌ రమేశ్‌ అలియాస్‌ సంతోష్‌పై ఫారెస్ట్‌ బీట్‌ అధికారి తిరుపతి నాయక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement