సమ్మెబాటలో కాటన్‌ కార్మికులు | - | Sakshi
Sakshi News home page

సమ్మెబాటలో కాటన్‌ కార్మికులు

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

● చీరల కూలి పెంచాలని డిమాండ్‌

● చీరల కూలి పెంచాలని డిమాండ్‌

సిరిసిల్లటౌన్‌: కార్మికక్షేత్రంలో సమ్మైసెరన్‌ మోగింది. తమ సమస్యలను యజమానులు పరిష్కరించకపోవడంతో పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కాటన్‌ చీరల ఉత్పత్తిదారులు ఆసాములు, కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. స్థానిక అంబాభవాని ఆలయంలో సోమవారం నుంచి సమ్మె చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ కాటన్‌ చీరలను ఉత్పత్తి చేస్తున్న యజమానులు కూలి పెంచకుండా కార్మికులను, ఆసాములను శ్రమదోపిడీకి గురి చేస్తున్నారన్నారు. కూలి పెంచాలని యజమానులకు డిమాండ్‌ నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. చీరకు కార్మికులకు రూ.100, ఆసాములకు రూ.150 కూలీ ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement