● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకే గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు 26 ఫిర్యాదులు వచ్చాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ ప్రజల సమస్యలపై ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌వోలతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు.
పోలీస్‌యాక్ట్ అమలు
జిల్లాలో శాంతి భద్రతల దృష్టిలో ఉంచుకొని పోలీస్ యాక్ట్–1861 ప్రకారం నెల రోజులపాటు అమలులో ఉంటుందని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు నిర్వహించరాదన్నారు.
శిక్షణలో సర్పంచులు
ఇల్లంతకుంట/కోనరావుపేట: గ్రామాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న శిక్షణకు జిల్లా నుంచి ఇద్దరు సర్పంచులు పాల్గొంటున్నారు. హైదరాబాదులోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లి సర్పంచ్ పండుగ సునిత, కోనరావుపేట మండలం బావుసాయిపేట సర్పంచ్ షేక్ యాస్మిన్‌పాషా ఎంపికయ్యారు.
సిరిసిల్ల: జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిరంతరం వైద్యసేవలు, మందులు అందిస్తూ పర్యవేక్షించాలని డీఎంహెచ్‌వో ఏంజెలా ఆల్ఫ్రెడ్ కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో సోమవారం పీహెచ్‌సీల వైద్యులు, సిబ్బందితో సమీక్షించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ క్షయవ్యాధి నియంత్రణ(ఎన్‌టీఈపీ), కుష్ఠు నిర్మూలన (ఎన్‌ఎల్‌ఈపీ), జాతీయ ఎయిడ్స్ నియంత్రణ(ఎన్‌ఏసీపీ), అంధత్వ నియంత్రణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ, అసంక్రమిక వ్యాధుల నియంత్రణ (ఎన్‌పీసీడీసీఎస్), సార్వత్రిక రోగనిరోధక టీకాల(యూఐపీ) కార్యక్రమాలపై సమీక్షించారు. ప్రోగ్రాం అధికారులు సంపత్‌కుమార్, రామకృష్ణ, వేణుగోపాల్‌రెడ్డి, నయిమా జహా పాల్గొన్నారు.
కోనరావుపేట(వేములవాడ): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ పింఛన్ మంజూరు చేసి నెలకు రూ.4,016 జీవనభృతి అందించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. కోనరావుపేట ఎంపీడీవో కార్యాలయం ఎదుట సోమవా రం ఆందోళన చేశారు. బీడీ కార్మికులకు ఇచ్చి న ఎన్నికల హామీ అమలు చేయాలని డి మాండ్ చేశారు. తెలంగాణ బీడీ, సీగార్ వర్క ర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూ రం పద్మ, ఉపాధ్యక్షురాలు దాసరి రూప, జిల్లా క మిటీ సభ్యులు లింగంపల్లి జ్యోతి పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: మహిళలు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబన సాధించా లని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సూర దేవరాజు కోరారు. బీవైనగర్‌లోని ఏసుక్రీస్తు శిష్య బృందం చర్చిలో పాస్టర్ జాన్ హైజగ్ ఆధ్వర్యంలో దీపాల వత్తులు తయారీ మిషన్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఇంటివద్దే ఉపాధి కల్పించేలా కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీని ద్వారా మహిళలు ఇంటివద్దే రోజుకు రూ.500 నుంచి రూ.వేయి వరకు సంపాదించే అవకాశం ఉందన్నారు. వంగరి అనిల్, ఆడెపు ప్రసాద్, సూర రాజు, రమేశ్, మల్లేశం పాల్గొన్నారు.


