సోషల్‌ మీడియాను వినియోగించుకోండి | - | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాను వినియోగించుకోండి

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ/వేములవాడరూరల్‌: ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను ఖండించాలని, ఇందుకు సోషల్‌మీడియాను వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. వేములవాడ రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీ కమిటీ సభ్యులు సోమవారం విప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి గ్రామస్థాయి కార్యకర్తల కృషి ఎంతగానో ఉందన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఏఎంసీ చైర్మన్‌ రొండి రాజు, రూరల్‌ పార్టీ అధ్యక్షుడు సోయినేని కరుణాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

చెరువుల మరమ్మతు ప్రతిపాదనలు చేయండి

నియోజకవర్గంలోని 394 చెరువులను పరిశీలించి.. చేపట్టాల్సిన మరమ్మతు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సూచించారు. నియోజకవర్గ ఇరిగేషన్‌ అధికారులతో తన నివాసంలో సోమవారం సమీక్షించారు. నీటిపారుదలశాఖ ఎస్‌ఈ రమేశ్‌, ఈఈ ప్రశాంత్‌, డీఈ దయాకర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement