ఆలకించండి.. ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

ఆలకించండి.. ఆదుకోండి

Sep 1 2026 12:37 AM | Updated on Sep 1 2026 12:37 AM

● కలెక్టరేట్‌ బాట పట్టిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

● కలెక్టరేట్‌ బాట పట్టిన బాధితులు ● అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌

సిరిసిల్ల అర్బన్‌: పింఛన్‌ మంజూరు చేయాలని ఒకరు.. భూమికి పట్టాలు ఇప్పించాలని మరొకరు.. తమ గ్రామానికి బీటీ రోడ్డు వేయించాలని గ్రామస్తులు.. ఇలా తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించేందుకు సోమవారం కలెక్టరేట్‌ బాట పట్టారు. ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి తమ విన్నపాలు అందించారు. వివిధ సమస్యలపై 162 అర్జీలు స్వీకరించిన కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో 8 దరఖాస్తులు రాగా, మండల పరిషత్‌లలో 90 దరఖాస్తులు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement