రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండలం గైదిగుట్ట తండా గ్రామంలో నిర్మిస్తున్న ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ట్రైబల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల పనులు పూర్తికాక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కరించి సహకారం అందిస్తానన్నారు. నాయకులు, అధికారులు పాల్గొన్నారు.


