కార్మికులు మంచి అలవాట్లు అలవరచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులు మంచి అలవాట్లు అలవరచుకోవాలి

Mar 14 2026 7:23 AM | Updated on Mar 14 2026 7:23 AM

సిరిసిల్ల: నేత, ఇతర రంగాల్లోని కార్మికులు మంచి అలవాట్లను అలవరచుకోవాలని సైకాలజిస్ట్‌ కె.పున్నంచందర్‌ సూచించారు. స్థానిక వెంకట్రావునగర్‌లో శుక్రవారం మైండ్‌ కేర్‌ అండ్‌ కౌన్సిలింగ్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో సామూహిక మనోవికాస సదస్సు నిర్వహించారు. పున్నంచందర్‌ మాట్లాడుతూ కార్మికులు పొగ తాగడం, మద్యం సేవించడం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. మైండ్‌ కేర్‌ సెంటర్‌ సిబ్బంది కొండ ఉమా, బూర శ్రీమతి, రాపెల్లి లత పాల్గొన్నారు.

భూసార పరీక్షలు చేయించాలి

చందుర్తి(వేములవాడ): భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు వాడితే సాగు ఖర్చులు తగ్గుతాయని బాబు జగ్జీవన్‌రామ్‌ వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్‌ మధుకర్‌ పేర్కొన్నారు. మూడపల్లి రైతువేదికలో పంటల సాగులో యాజమాన్య పద్ధతులపై శుక్రవారం అవగాహన సదస్సును సర్పంచ్‌ చిలుక మల్లేశ్వరీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రుద్రంగి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, మార్కెట్‌ డైరెక్టర్‌ లావణ్య, చందుర్తి మండల వ్యవసాయాధికారి దుర్గారాజు, ఏఈవో ప్రవీణ్‌ హాజరయ్యారు.

అవగాహన కల్పించాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ప్రత్యేక అధికారి ఎం.శ్రీనివాస్‌ సూచించారు. మండలంలోని జిల్లెల్ల, నేరెళ్ల గ్రామాల్లో శుక్రవారం పర్యటించి మాట్లాడారు. తడిచెత్త, పొడిచెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎంపీవో మీర్జా అఫ్జల్‌ అహ్మద్‌బేగ్‌, ఏపీవో రాపోల నాగరాజు, కార్యదర్శి రాజు, టీఏ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

అల్మాస్‌పూర్‌లో టవర్‌ నిర్మించొద్దని నిరాహార దీక్ష

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని అల్మాస్‌పూర్‌లో జనావాసాల మధ్య ఎయిర్‌టెల్‌ సెల్‌టవర్‌ ఏర్పాటు చేయొద్దని కోరుతూ గ్రామస్తులు మూడో రోజు శుక్రవారం నిరాహార దీక్ష కొనసాగించారు. సర్పంచ్‌ నాగెల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామానికి దూరం సెల్‌టవర్‌ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఉపసర్పంచ్‌ కొర్రి అనిల్‌, మాజీ ఎంపీపీ పిల్లి రేణుక, నాయకులు పిల్లి కిషన్‌, పుణ్యానాయక్‌, రాజయ్య పాల్గొన్నారు.

గోల్డెన్‌ అవర్‌లో జాగ్రత్తగా ఉండాలి

సిరిసిల్లటౌన్‌: రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను గోల్డెర్‌ అవర్‌లోనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి చేర్చాలని 108 ఉమ్మడి జిల్లా పీవో భూమా నాగేందర్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిలిపి ఉంచిన 108 అత్యవసర అంబులెన్స్‌, 102 అమ్మఒడి, 1962 సంచార పశువైద్యశాల వాహనాలను జిల్లా మేనేజర్‌ అరుణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం తనిఖీలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement