జిల్లాలో అమలుకాని వాటర్‌బెల్ అనారోగ్యానికి గురవుతున్న విద్యార్థులు జిల్లెల్ల బడిలోనే మోగుతున్న నీటిగంట జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): వాటర్‌బెల్.. అవును నిజమే పాఠశాలలో అమలు చేయాల్సిన అత్యంత ప్రాధాన్యమున్న బెల్ ఇది. ఈ బెల్ మోగగానే విద్యార్థులందరూ తగినంత నీరు తాగేలా చూడడం అత్యంత అవసరం. గతంలో జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో వినిపించిన ‘వాటర్ బెల్’ ఇప్పుడు మోగటం లేదు. ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా ‘వాటర్ బెల్’ అమలు చేయాల్సిన అవసరం ఉంది. నీళ్లు తాగకపోవడంతో చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలామంది ఇంటి నుంచి నీటిసీసాలు తీసుకెళ్తున్నప్పటికీ మధ్యాహ్నం సమయంలోనే అన్నం తినేటప్పుడే ఆ నీటిని తాగుతున్నారు. ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుందని భయంతో విద్యార్థులు నీటిని సరిగా తీసుకోవడం లేదని తెలి సింది. సరిపడా నీటిని తాగకపోవడంతో మూత్రకోశ వ్యాధులతోపాటు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది.
గతంలో అమలు చేసినా...
సాధారణ రోజుల్లో ఇంటర్‌వెల్, లంచ్ బ్రేకులతోపాటు ఉదయం 10.30గంటలకు, మధ్యాహ్నం 2.30కు వాటర్ బెల్ మోగించాలి. ఒంటి పూట బడుల సమయంలో ఉదయం 9.30కు, మళ్లీ 11గంటలకు మోగించాలి. తద్వారా విద్యార్థులు ఎక్కువ నీరు తాగేలా ప్రోత్సహించి, అనారోగ్యం బారిన పడకుండా చూడవచ్చు. జిల్లాలో చాలా పాఠశాలల్లో ప్రభుత్వంతో పాటు, పలు స్వచ్ఛంద సంస్థలు వాటర్ ప్లాంట్స్‌ను ఏర్పాటు చేశారు. ఐతే అనేక పాఠశాలల్లో ఇవి పనిచేయకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇళ్ల నుంచి నీటి సీసాలు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
నీరు ఎంత తాగాలి
జిల్లెల్ల బడిలోనే నీటి గంట సవ్వడి
తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిసారిగా వాటర్ బెల్‌ను అమలు చేస్తున్నారు. బడి ప్రారంభమైన తర్వాత ప్రతీ రెండు పీరియడ్లకు ఒకసారి నీటి గంట మోగిస్తారు. ఈ సమయంలో ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని నీరు తాగమని ప్రోత్సహిస్తారు. తద్వారా విద్యార్థులు డీహైడ్రేషన్ సమస్యను జయిస్తూ రోజంతా ఉల్లాసంగా గడుపుతున్నారు.
సమాచారం ఇలా..
పాఠశాలలు సంఖ్య విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలలు 511 38,629
రెసిడెన్షియల్ పాఠశాలలు 21 7,762
ప్రైవేటు పాఠశాలలు 131 31,026


