నిబంధనలు పాటించాలి
● జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ ● 200 మంది డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు
సిరిసిల్ల: వాహనదారులు రవాణాశాఖ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. సిరిసిల్ల ఆర్టీవో ఆఫీస్‌లో ఆదివారం రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లకు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వైద్యులతో ఉచిత నేత్రవైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ‘సడక్ సురక్ష అభియాన్’లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీటుబెల్టు ఆవశ్యకత, హెల్మెట్ వినియోగం, డ్రంకెన్‌డ్రైవ్, ర్యాష్‌డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఎంత ప్రమాదమో వివరిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా 200 మంది డ్రైవర్లకు కంటి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఎంవీఐ వంశీధర్, ఎల్వీ ప్రసాద్ కంటి వైద్యులు, ఏఎంవీఐలు రజనీ, పృథ్వీరాజ్‌వర్మ, ఆర్‌టీఏ సభ్యులు సంగీతం శ్రీనాథ్ పాల్గొన్నారు.


