నేరాలు నియంత్రిస్తాం
నేరాల నియంత్రణకు శ్రమిస్తాం. కొత్త ఏడాదిలో ప్రజాక్షేత్రంలో మరింత సమర్థంగా పనిచేస్తుంది. నేరం చేస్తే.. శిక్ష తప్పదనేలా నిందితులకు శిక్ష పడేలా పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. సైబర్ నేరాలను సవాల్‌గా తీసుకుని శాసీ్త్రయంగా వారి ఆటలను కట్టడి చేస్తాం. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. గంజాయి రహిత జిల్లాగా మార్చుతాం. జిల్లాలో గంజాయి రవాణా, నిల్వలు, విక్రయాలపై నిఘా ఉంచి కట్టడిచేస్తాం. గంజాయిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలి. విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ శాంతిభద్రత పరిరక్షణలో ముందుంటాం. పోలీసులు ప్రజలకు చేరువయ్యేలా చూస్తాం. నేరాల నియంత్రణకు టెక్నాలజీని వినియోగించుకుంటాం. జిల్లా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు.
– మహేశ్ బీ గీతే, ఎస్పీ


