సమ్మక్క భక్తులకు సౌకర్యాలు కల్పించండి
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: సమ్మక్క జాతర సందర్భంగా వేములవాడకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం తన నివాసంలో ఆలయ ఈవో రమాదేవి, ఈఈ రాజేశ్, డీఈ రఘునందన్, అర్చకులతో సమావేశమయ్యారు. వరుస సెలవులు ఉన్నందున భక్తుల రద్దీ ఉంటుందని, ఈక్రమంలో నిరంతర దర్శనాలు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వేడినీటిని అందుబాటులో ఉంచాలన్నారు. తాగునీరు, చలువ పందిళ్లు, క్యూలైన్లలో సక్రమమైన ఏర్పాట్లు చేయడంతోపాటు శానిటేషన్ పనులు శుభ్రంగా చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘా పెంచాలన్నారు.


