భక్తులకు ఇబ్బంది కలగొద్దు
వేములవాడ: రాజన్న, భీమన్న దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని దుకాణదారులకు సూచించారు. రోడ్డును ఆక్రమించిన దుకాణాలు తొలగింపజేశారు. వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులతో శుక్రవారం భీమన్న, బద్దిపోచమ్మ ఆలయాల ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్పీ అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. ఆ ప్రాంతంలో రోడ్డుపైకి వచ్చిన దుకాణాలను తొలగింపజేశారు. ఆటోడ్రైవర్లు పోలీసుల సూచనలు పాటించాలని సూచించారు. టౌన్ సీఐ వీరప్రసాద్ ఉన్నారు.
చందుర్తి(వేములవాడ): శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏఎస్పీ రుత్విక్‌సాయి సూచించారు. చందుర్తి ఠాణాను తనిఖీ చేశారు. పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. డయ ల్ 100కు వచ్చే కాల్స్‌పై స్పందించాలని సూచించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేశ్ ఉన్నారు.


