ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు(డెలివరీలు) జరిగేలా ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం పీహెచ్‌సీ డాక్టర్లతో సమావేశమయ్యారు. జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ కేంద్రం నిర్ధేశించిన ఆరోగ్య పథకాలను సమర్థంగా అమలు చేయాలన్నారు. పిల్లలకు వ్యాక్సినేషన్ చేయాలని, వైద్యాధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు అంజలి, సంపత్‌కుమార్, రామకృష్ణ, అనిత, నయిమా జహా పాల్గొన్నారు.
గురుకులం తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత గురువారం తంగళ్లపల్లిలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ప్రోగ్రాం అధికారి సంపత్, సీహెచ్‌వో బాలచంద్రం, ఏఎన్‌ఎం జ్యోతి పాల్గొన్నారు.


