
సీపీఎస్ రద్దు చేయాలి
సిరిసిల్లఎడ్యుకేషన్: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో సిరిసిల్లలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ 2004, సెప్టెంబర్ 1వ తేదీ తర్వాత నియామకమైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి ఎడ్ల కిషన్, జిల్లా గౌరవ అధ్యక్షుడు నీలి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు చిప్ప యాదగిరి, గుర్రం మల్లారెడ్డి, రాజు, అనిల్, మధు తదితరులు పాల్గొన్నారు.