
కేటీఆర్ చొరవతో సాగునీటి కాలువ శుభ్రం
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని చెరువులకు నీరు రావడం లేదని, కాలువలు శుభ్రం చేస్తే చెరువుల్లోకి నీరు వస్తుందని బీఆర్‌ఎస్ నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్‌కు విన్నవించారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ వెంటనే హిటాచి వాహనాన్ని సమకూర్చారు. శనివారం నుంచి ఫీడర్ చానల్ శుభ్రం చేసే పనులు ప్రారంభమయ్యాయి. కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, చెట్లపొదలను తొలగిస్తున్నారు. పనులను నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు పరిశీలించారు. బీఆర్‌ఎస్ నాయకులు వెంకటస్వామిగౌడ్, వెంకటియాదవ్, కమలాకర్‌రెడ్డి, బండ రమేశ్, రత్నాకర్, కిశోర్, నర్సింగారావు, ఎగదండి స్వామి, గంధ్యాడపు రాజు, దయాకర్‌రావు తదితరులు ఉన్నారు.