
‘కార్మికులు పస్తులు ఉంటున్నారు’
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రజాపాలనలో పవర్‌లూమ్ కార్మికులు పస్తులు ఉండాల్సి వస్తోందని యాజమాన్యం ఆధిపత్యం కోసం కార్మికులు అవస్థలు పడుతున్నారని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శ్రీరాముల రమేశ్‌చంద్ర ఆరోపించారు. కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 12వ రోజుకు చేరుకోగా వారికి సంఘీబావం తెలిపి మాట్లాడారు. ప్రభుత్వ ఆర్డర్ వస్త్రానికి కార్మికుడికి రోజుకు రూ.వెయ్యి కూలి అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సోషల్ వెల్ఫేర్ వస్త్రానికి మీటర్‌కు రూ.20 లాభం యజ మానులు తీసుకుంటూ కార్మికులకు కూలి పెంచకపోవడం దుర్మార్గమన్నారు. కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. టెక్స్‌టైల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, జెల్ల సదానందం, మహేశ్, కనకయ్య, కిషన్, శ్రీకాంత్, సంపత్, శ్రీనివాస్, వెంకటేశ్, ఆంజనేయులు, భాస్కర్, సత్యనారాయణ, రమేశ్, అంబదాస్, రాజేశ్, శంకర్, వేణు, రాజశేఖర్, రవి పాల్గొన్నారు.