
విద్యార్థుల భవిష్యత్‌కు దిశ చార్ట్ : ఎస్పీ
సిరిసిల్ల: విద్యార్థుల భవిష్యత్‌కు దిశను చూపించేందుకు కెరీర్ చార్ట్ ఉపయోగపడుతుందని ఎస్పీ మహేశ్ బి గీతే పేర్కొన్నారు. వేములవాడకు చెందిన వీడీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దండు వినోద్, కార్యదర్శి అమరగొండ అజయ్ రూపొందించిన కెరీర్‌చార్ట్‌ను శనివారం ఆవిష్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ పదోతరగతి తరువాత ఏయే కోర్సులు చేయవచ్చు, డిగ్రీ, మాస్టర్స్‌లోనూ ఏ కోర్సులు ఎంచుకుంటే.. ఎలాంటి అవకా శాలుంటాయని చార్ట్‌ను తయారు చేయడం అభినందనీయమన్నారు. డీఈవో వినోద్‌కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీనివాస్‌లకు కెరీర్‌చార్ట్‌ను అందించారు.
సిరిసిల్లకల్చరల్: స్వామి రామానంద్ తీర్థ రూరల్ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ గిరిజ న యువతకు స్వయం ఉపాధినిచ్చే పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గి రిజనాభివృద్ధి అధికారి సంగీత శనివారం తెలిపారు. అకౌంట్స్ ఆఫీసర్(ట్యాలీ), కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్, ఆటోమొబైల్, టూ వీలర్ సర్వీసింగ్, సోలార్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్, సర్వీస్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులని పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌లోని రామానంద తీర్థ గ్రామీణ సంస్థ కార్యాలయంలో సెప్టెంబర్ 1వ తేదీలోపు దరఖాస్తులు అందజేయాలని సూచించారు.