రెండు షిఫ్టుల్లో చీరలు ఉత్పత్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

రెండు షిఫ్టుల్లో చీరలు ఉత్పత్తి చేయండి

Aug 27 2025 9:43 AM | Updated on Aug 27 2025 9:43 AM

రెండు

రెండు షిఫ్టుల్లో చీరలు ఉత్పత్తి చేయండి

● చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ అక్టోబర్‌లోగా పనులు పూర్తి చేయండి ● కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మెరుగైన వైద్యసేవలందించాలి ● డీఎంహెచ్‌వో రజిత ఐకేపీకి రైస్‌మిల్‌ మంజూరు

● చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌

సిరిసిల్ల: వస్త్రోత్పత్తిదారులు రెండు షిఫ్టుల్లో ఉత్పత్తి చేసి సెప్టెంబర్‌ 15లోగా చీరలను అందించాలని చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యార్‌ కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాతో కలిసి వస్త్రోత్పత్తిదారులతో సమీక్షించారు. సిరిసిల్లకు రెండు విడతల్లో 4.30 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వగా.. 50 శాతం మేరకు పూర్తయిందన్నారు. చీరల ఉత్పత్తిలో వెనకబడిన వారి ఆర్డర్లను రద్దు చేసి పూర్తి చేసిన వారికి అందిస్తామని స్పష్టం చేశారు. జౌళిశాఖ జేడీ, టెస్కో సీజీఎం ఎన్‌.వెంకటేశ్వర్‌రావు, ఏడీ రాఘవరావు, వస్త్రోత్పత్తిదారుల అసోసియేషన్‌ ప్రతినిధులు ఆడెపు భాస్కర్‌, గోవిందు రవి, మంచె శ్రీనివాస్‌, వేముల దామోదర్‌, దూడం శంకర్‌, బూట్ల నవీన్‌, యెల్దండి దేవదాస్‌, మండల సత్యం, కట్టెకోల శివశంకర్‌ పాల్గొన్నారు.

వర్కర్‌ టు ఓనర్‌ అమలు చేయండి

స్థానిక కార్మికులకు ‘వర్కర్‌ టు ఓనర్‌’ పథకాన్ని అమలు చేయాలని పవర్‌లూమ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌ను కోరారు. స్థానిక ‘కే’ కన్వెన్షన్‌లో మంగళవారం కలిసి నేతకార్మికుల సమస్యలు వివరించారు. ఇప్పటికే నిర్మించిన వర్క్‌షెడ్లలో సాంచాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇవ్వాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న 10 శాతం యారన్‌ సబ్సిడీ డబ్బులు విడుదల చేయాలని విన్నవించారు.

వేములవాడఅర్బన్‌: అంజన్న ఆలయ అభివృద్ధి పనులు అక్టోబర్‌లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారంలోని హనుమాన్‌ ఆలయం వద్ద రూ.31లక్షలతో ఆర్చి, ప్రాకారం పనులను కలెక్టర్‌ పరిశీలించారు. పంచాయతీరాజ్‌శాఖ డీఈ విష్ణువర్ధన్‌, అంజన్న ఆలయ ఈవో శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

తంగళ్లపల్లి(సిరిసిల్ల): జ్వరపీడితుల రక్త నమూనాలు సేకరించి మెరుగైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వో రజిత సూచించారు. స్థానిక పీహెచ్‌సీలో మందుల నిల్వలను మంగళవారం తనిఖీ చేశారు. సరిపడా నిల్వ ఉంచుకోవాలని మెడికల్‌ అధికారి అఫీజాకు సూచించారు. అనంతరం ఇందిరమ్మకాలనీలో డెంగీ నివారణ మెడికల్‌ క్యాంపును పరిశీలించారు. మలేరియా ప్రోగ్రాం అధికారి అనిత, ఏపి డిమియాలజిస్ట్‌ సోనిమణి, రాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌ సూపర్‌వైజర్లుపాల్గొన్నారు.

మల్టీపుల్‌ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తోనే సహస్ర మృతి

తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందని సర్గు సహస్ర(8) వైరల్‌ పైరాక్సియా (ఎన్సిఫెలిటీస్‌)తో బ్రెయిన్‌ ఇన్‌ఫెక్షన్‌ అయిందని డీఎంహెచ్‌వో రజిత తెలిపారు. మల్టీపుల్‌ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తోనే చనిపోయిందని పేర్కొన్నారు.

ముస్తాబాద్‌(సిరిసిల్ల): మహిళలు స్వయం సమృద్ధి సాధించే దిశగా మరో కీలక అడుగు ముందుకు పడింది. ముస్తాబాద్‌ శుభోదయ మండల మహిళా సమాఖ్యకు చేసిన రైస్‌మిల్లు ప్రతిపాదనలు పట్టాలు ఎక్కనుంది. ఇరవై రోజుల క్రితం కలెక్టర్‌ ముస్తాబాద్‌లోని ఐకేపీ పాత భవనాలను పరిశీలించారు. గతంలో ఇక్కడ రైస్‌మిల్లు నిర్వహించారని డీఆర్‌డీఏ అధికారులు తెలపడంతో రూ.5 కోట్లతో అధునాతన మిషనరీతో రైస్‌మిల్లు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రైస్‌మిల్లు త్వరలోనే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

రెండు షిఫ్టుల్లో చీరలు ఉత్పత్తి చేయండి1
1/1

రెండు షిఫ్టుల్లో చీరలు ఉత్పత్తి చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement