నేతన్నలకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

నేతన్నలకు అండగా ఉంటాం

Aug 27 2025 9:43 AM | Updated on Aug 27 2025 9:43 AM

నేతన్నలకు అండగా ఉంటాం

నేతన్నలకు అండగా ఉంటాం

● చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ● త్రిఫ్ట్‌ పొదుపు డబ్బుల చెక్కులు పంపిణీ

● చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ● త్రిఫ్ట్‌ పొదుపు డబ్బుల చెక్కులు పంపిణీ

సిరిసిల్ల: రైతన్నల్లాగే.. నేతన్నలకూ అండగా ఉంటామని, వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని రాష్ట్ర చేనేత, జౌళి, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ‘కే’ కన్వెన్షన్‌లో 4,963 మంది పవర్‌లూమ్‌ కార్మికులకు రూ.12.41కోట్ల త్రిఫ్ట్‌ ఫండ్‌ పొదుపు డబ్బుల చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌తో కలిసి మంగళవారం పంపిణీ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ నేతకార్మికుల రూ.లక్ష రుణమాఫీని రాబోయే కేబినెట్‌లో చర్చించి వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా మహిళాశక్తి చీరల ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

కార్మిక, ధార్మిక క్షేత్రంగా అభివృద్ధి

ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ధార్మిక, కార్మిక క్షేత్రంగా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నేతకార్మికులకు రూ.352కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యార్‌, కాంగ్రెస్‌ నేత కె.కె. మహేందర్‌రెడి, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేశ్‌ బి గీతే, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ వెల్ముల స్వరూపారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు రాజేందర్‌రావు, సంగీతం శ్రీనివాస్‌, చొప్పదండి ప్రకాశ్‌, సూర దేవరాజు, కచ్చకాయల ఎల్లయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జౌళిశాఖ జేడీ ఎన్‌.వెంకటేశ్వర్‌రావు, ఏడీ రాఘవరావు, వస్త్రోత్పత్తిదారులు, ఆసాములు, కార్మికులు పాల్గొన్నారు.

జ్యోతిబాపూలే ఆశయాలు సాధిద్దాం

వివక్షను, అసమానతలను ఎదిరించి, ఆనాటి సమాజానికి చదువును అందించిన మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను సాధించాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు. సినారె జిల్లా గ్రంథాలయం ఎదుట పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించా రు. ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, గడ్డం నర్సయ్య, పర్శ హన్మాండ్లు, ఆకునూరి బాలరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు రాగుల రాములు, బొప్ప దేవయ్య,సూర దేవరాజు, సుధాకర్‌, కరుణాల భద్రాచలం, కార్తీక్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement