సర్దాపూర్‌లో ఏర్పాటు చేసిన ఓపెన్‌జిమ్ చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. పరికరాలు కూడా సరిగా పనిచేయడం లేదు. చాలా రోజులుగా వాటిని రిపేరు చేయడం లేదు. ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతున్న ఓపెన్ జిమ్స్‌కు ప్రత్యేక నిధులు కేటాయించి పరికరాలు మంచిగా పనిచేసేలా చూడాలి.
– తాళ్లపెల్లి శ్రీకాంత్, పెద్దూరు
ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇతర పట్టణాల్లో లేని విధంగా సిరిసిల్లలో ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చి స్మార్ట్ ఓపెన్‌జిమ్స్ ఏర్పాటు చేశారు. లక్ష్యసాధనలో గతంలో మాదిరిగా అధికారులు ఓపెన్‌జిమ్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
– ఎలిగేటి వీణ, సాయినగర్
నెల రోజుల్లో ఓపెన్‌జిమ్స్ మరమ్మతుకు టెండర్లు పూర్తి చేస్తాం. రిపేరు చేయించి విని యోగంలోకి తీసుకొస్తాం. ఎక్కడెక్కడ పరికరాలు పాడయ్యాయో సిబ్బంది పరిశీలించి మరమ్మతులు చేపడతాం. అన్ని ఏరియాల్లో ఓపెన్ జిమ్స్‌లో ప్రజలు వ్యాయామం చేసుకునేలా చూస్తాం.
– ఎంఏ ఖదీర్‌పాషా, మున్సిపల్ కమిషనర్
మరమ్మతు చేయించాలి
మరమ్మతు చేయించాలి