
ఆరోగ్య సేవలపై ఆరా
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని ఆయూష్మాన్ ఆరోగ్య కేంద్రం–2ను జిల్లా వైద్యాధికారి రజిత బుధవారం తనిఖీ చేశారు. గర్భిణీల నమోదు, టీకాల రికార్డులను పరిశీలించారు. వ్యాధి నిరోధక టీకాల ఆవశ్యకతపై పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పీవోఎంహెచ్ అంజలి, జిల్లా వ్యాధినిరోధక అధికారి సంపత్‌కుమార్, ఇన్సిడీ ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, వైద్యాధికారి వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
బోయినపల్లి(చొప్పదండి): కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిలో మండలంలోని వెంకట్రావుపల్లి వద్ద పోలీసులు బుధవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఎస్పీ మహేశ్ బి గీతే, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాలతో యూరియా అక్రమ రవాణా జరగకుండా వాహనాల తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఆరోగ్య సేవలపై ఆరా