
చిత్రం.. జ్ఞాపకాల పత్రం
కరీంనగర్‌లో తొలి ఫొటో స్టూడియోలు
రీళ్ల నుంచి డిజిటల్
ఎన్నో మార్పులు
అంతర్జాతీయ గుర్తింపు
అభిరుచితో రాణిస్తున్న పోలీస్
● ఫొటోగ్రఫీ డే గురించి
ఫ్రెంచ్ దేశస్తుడైన డాగురే 1839లో మొదటిసారి ఫొటోగ్రాఫీక్ ప్రాసెస్ కనిపెట్టి అదే సంవత్సరం ఆగష్టు 19న ప్రపంచానికి పరిచయం చేశాడు. సిల్వర్ అయొడైడ్ రసాయనంతో చిత్రానికి శాశ్వతత్వం కల్పించవచ్చని ప్రతిపాదించాడు. 1842 నుంచి 1880 మధ్య కాలంలో ఇండియలో ఫొటోగ్రఫీ పరిశ్రమ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పోర్ట్‌రయిట్ స్టూడియోను దీన్ దయాళ్ కెన్నడీ అనే మహిళ స్థాపించింది. 1960 నాటికి స్టూడియో ఫొటోగ్రఫీ, 1980 నాటికి కంప్యూటర్‌తో కలర్ ఫొటోగ్రఫీ విస్తరించింది. రాజా త్రయంబక్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి సారి 1957లో ఫొటోగ్రఫీ సొసైటీ ప్రారంభమైంది.
● ఉమ్మడి జిల్లా ప్రస్థానం
1940లో ఉమ్మడి జిల్లా కేంద్రం కరీంనగర్‌లో మొదటి ఫొటోస్టూడియో నెలకొల్పారు. ప్రతిష్టాత్మక ఫెలోషిఫ్ ఆఫ్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ(ఇంగ్లాండ్) సాధించిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఏకై క వ్యక్తి కోరుట్లకు చెందిన ఫొటోగ్రాఫర్ బండి రాజన్‌బాబు. 1987లో నగ్న చిత్రాలపై థీసిస్ సమర్పించి రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందారు. జగిత్యాలకు చెందిన అల్లె శ్రీకాంత్, కోరుట్లకు చెందిన బండి వెంకటరమణ, కరీంనగర్‌కు చెందిన బాబురెడ్డి, వేణు, రాజు, సంపత్‌కుమార్, వాసు, గంగాధర్, సదానందం, ఆత్మారాం, వేములవాడకు చెందిన రాజయ్య, జగిత్యాలకు చెందిన రామ్మోహన్, సతీష్, సిరిసిల్లలో ఎం.సి. శేఖర్, బోడ రవీందర్, కోడం దేవేందర్, వంకాయల శ్రీకాంత్, కోరుట్లకు చెందిన నాగరాజు, రాజేశం, శేఖర్, మహేందర్, మారుతి, మెట్‌పల్లి రాము, మల్యాల శ్రీనులు, ఎల్లారెడ్డిపేటకు చెందిన ప్రభాకర్‌రెడ్డి, సిరిసిల్లకు చెందిన శంకర్ మరెందరో ఫొటోగ్రఫీలో సృజనాత్మకతను జోడించి రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు.
● ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీ
ఏ ఫంక్షన్ జరిగిన, ఎక్కడికి వెళ్లిన సెల్‌ఫోన్లతోనే ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ ఫొటోగ్రఫీపై కొత్తగా జంటలు ఉత్సాహం చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా తమకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని ప్రీ వెడ్డింగ్ ఫొటోలతోపాటు పెళ్లి వేడుకలను ఫొటోగ్రాఫర్లతో తీయించుకుంటున్నారు.
చరితకు చెరిగిపోని సాక్ష్యం
నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం
విద్యానగర్(కరీంనగర్)/సిరిసిల్ల: ఫొటో.. చెదిరిపోని జ్ఞాపకం. గతించిన కాలాన్ని కళ్ల ముందుంచే సాక్ష్యం. మదిలే మెదిలే భావాలను కళ్ల ముందు నిలిపే ఛాయాచిత్రం. ఫొటోగ్రఫీకి సృజనాత్మకత తోడైతే అద్భుత చిత్రాలు కళ్లముందుంటాయి. మదిని పులకింపజేసి.. మనుసును తట్టిలేపి.. మధురమైన అనుభూతులను పదిలం చేసేది ఫొటో. నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఫొటోగ్రఫీలో వస్తున్న మార్పులు..
జిల్లా వాసుల ప్రతిభపై ప్రత్యేక కథనం.
1961 ప్రాంతంలో కరీంనగర్‌లో ఫొటో స్టూడియోలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్‌లోని క్లాక్‌టవర్ వద్ద ఏవీఎం ఫొటో స్టూడియో, తిలక్‌రోడ్‌లో అజంతా ఫొటో స్టూడియోను ప్రారంభించారు. కరీంనగర్‌కు చెందిన ఏలేటి వేణుమాధర్‌రెడ్డి 1961 జనవరి 1న ఆయన పేరుతో ఏవీఎం స్టూడియో ప్రారంభించారు. మూడేళ్ల తర్వాత గురుదత్త నిర్మాత సారథ్యంలో ముంబైలో రూపొందిన మొదటి స్కొప్ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా పనిచేశారు. బ్లాక్ అండ్ వైట్ మాన్యువల్ నుంచి 35 ఎంఎం మినియేచర్ ఫిలిం, కలర్ ప్రాసెసింగ్ కంప్యూటర్ వరకు కొనసాగారు. ఆయన వాడిన 1945 నాటి రోలిఫ్లెక్స్, ఎగ్జాక్ట, మన్య, కేబినేట్, ఫుల్‌సైజ్‌ల నెగెటివ్‌ల బాడీ కెమెరాలు ఇప్పటికి వాళ్ల ఇంట్లో భద్రంగా ఉన్నాయి. ఆయన నలుగురు కొడుకులు ఈ రంగంలోనే రాణిస్తున్నారు.
నాడు రీళ్లతో ఫొటోలు తీసేవాళ్లం, సాంకేతిక ప్రగతిలో నేడు డిజిటల్ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. సెల్‌ఫోన్ కెమెరాలు, ఇంటింటికీ కెమెరాలు వచ్చినప్పటికీ ఫొటో స్టూడియోలకు ఆదరణ తగ్గలేదు. రీళ్ల పద్ధతి పోయి, డిజిటల్ కెమెరాలు, ప్రింటింగ్ యంత్రాలు ప్రవేశించడంతో ఈ ప్రక్రియ పూర్తిగా సులభతరమైంది. – ఆవుల నరేశ్, ఫొటోగ్రాఫర్, జ్యోతినగర్, కరీంనగర్
మా చిన్నప్పుడు ఫొటో అంటే ఓ క్రేజ్. ఏదైనా ఫంక్షన్ జరిగితే ఫొటోగ్రాఫర్ వచ్చి ఫొటోలు తీయడం, స్టూడియోకి వెళ్లి ఫొటోలు దిగడం చాలా కొత్తగా అనిపించేది. ఇప్పుడు సెల్‌ఫోన్‌లో అన్ని ఫంక్షన్‌లు, అన్ని సందర్భాల్లో ఫొటోలు తీసుకోవడం, మెమొరీ కార్డుల్లో భద్రపరచుకుంటున్నాం.
– పల్లెర్ల శ్రీనివాస్, అశోక్‌నగర్, కరీంనగర్
సిరిసిల్లకు చెందిన ఫొటోగ్రాఫర్ మేర్గు చంద్రశేఖర్(ఎంసీ శేఖర్)కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దక్షిణాఫ్రికా పర్యాటక గిరిజనశాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిలా ఆర్ట్ ఆఫ్ ఫొటోగ్రఫీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచస్థాయి పోటీల్లో శేఖర్ తీసిన ‘హార్టీస్మైల్’ బంగారు పతకం సాధించింది. అంతకుముందే శేఖర్ దశాబ్దకాలంగా గిరిజన జీవనశైలిపై, సామాజిక అంశాలపై ఫొటోలు తీసి పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సిగ్మా ఫొటోగ్రఫీ అకాడమీ స్థాపించారు. ఔత్సాహికులైన ఫొటోగ్రాఫర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఇటీవల సాలర్‌జంగ్ మ్యూజియంలో రాష్ట్రస్థాయి ఫొటో వర్క్‌షాప్ నిర్వహించారు. ఎం.సీ.శేఖర్ తీసిన ఫొటోలకు 98 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన దాసరి మల్లేశ్ కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీపై మక్కువ పెంచుకున్న మల్లేశ్ ఫొటోగ్రఫీలోని మెలకువలను నేర్చుకొని.. తీరక సమయంలో తన కళాభిరుచిని తీర్చుకుంటున్నారు. ఫొటో వర్క్‌షాప్‌లలో పాల్గొని అద్భుత ఫొటోలు తీసి బహుమతులు అందుకున్నారు. పల్లె ప్రజల జీవన విధానం, సంస్కృతి సంప్రదాయాలపై తీసిన ఫొటోలకు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల జరిగిన జోనల్‌స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో ఫొటోగ్రఫీ విభాగంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం చేతుల మీదుగా మూడో బహుమతి అందుకున్నారు.

చిత్రం.. జ్ఞాపకాల పత్రం

చిత్రం.. జ్ఞాపకాల పత్రం

చిత్రం.. జ్ఞాపకాల పత్రం

చిత్రం.. జ్ఞాపకాల పత్రం

చిత్రం.. జ్ఞాపకాల పత్రం

చిత్రం.. జ్ఞాపకాల పత్రం

చిత్రం.. జ్ఞాపకాల పత్రం