
సొంతింటి కల సాకారం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ప్రజాప్రభుత్వ పాలనలో పేదలకు సొంతింటి కల సాకారం చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో సోమవారం నిర్వహించిన కడప పూజల్లో పాల్గొని మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రభుత్వం యజ్ఞంలా నిర్వహిస్తోందన్నారు. పట్టణంతోపాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు.
పాపన్న సేవలు చిరస్మరణీయం
సర్వాయి పాపన్న సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని పాపన్నచౌక్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
సిరిసిల్లఅర్బన్: త్రిఫ్ట్ నేతన్న పొదుపు పథకానికి సంబంధించిన డబ్బులను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమచేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల, టెక్స్‌టైల్ పార్క్‌లోని పవర్‌లూమ్, అనుబంధ రంగాల కార్మికులకు రావాల్సిన త్రిఫ్ట్ డబ్బులు వెంటనే కార్మికుల ఖాతాల్లో జమచేయాలని కోరారు. మూషం రమేశ్, నక్క దేవదాస్, కూచన శంకర్, సత్యం, బెజగం సురేష్ పాల్గొన్నారు.

సొంతింటి కల సాకారం