
చెరువు నిండదు
చినుకు ఆగదు..
ఇది గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పాల్వంచ, కూడెల్లివాగులు పారడంతో ఎగువ మానేరులోకి నీరు వచ్చి చేరింది. 33 అడుగుల సామర్థ్యం ఉన్న ఎగువ మానేరులో 31 అడుగుల మేరకు నీరు చేరింది. మరో రెండు అడుగుల నీరు చేరితే మత్తడి దూకుతుంది. మూడు నెలలపాటు మానేరు పారితేనే జిల్లాలో రెండో పంటకు సాగునీరు లభిస్తుంది. 10 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఎగువ మానేరు మత్తడి ఎప్పుడు దూకుతుందోనని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇది ముస్తాబాద్‌లోని లింగంకుంట. భారీ వర్షాలు పడితేనే ఈ కుంట నిండే పరిస్థితులు ఉన్నాయి. కొద్దిపాటి నీళ్లతో లింగంకుంట బోసిపోయి కనిపిస్తోంది. ఒక్క లింగంకుంటనే కాదు జిల్లా వ్యాప్తంగా 656 చెరువులు, కుంటలు ఉండగా 37 చెరువుల్లోనే నీరు నిండి మత్తడి పారుతున్నాయి. మిగతా 619 చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి.

చెరువు నిండదు