
ముసురువాన
సిరిసిల్ల: జిల్లాలో ఆదివారం ముసురు వర్షం కురిసింది. రుద్రంగిలో అత్యధికంగా 20.7 మిల్లీమీటర్ల వర్షం పడగా.. చందుర్తిలో 19.7, వేములవాడ రూరల్‌లో 12.1, బోయినపల్లిలో 20.6, వేములవాడలో 18.5, సిరిసిల్లలో 11.3, కోనరావుపేటలో 15.2, వీర్నపల్లిలో 14.6, ఎల్లారెడ్డిపేటలో 10.9, గంభీరావుపేటలో 6.7, ముస్తాబాద్‌లో 6.8, తంగళ్లపల్లిలో 9.6, ఇల్లంతకుంటలో 10.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. పొరుగునే ఉన్న కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాల్వంచ వాగులో వరదనీరు ప్రవహిస్తోంది. గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరులోని పాల్వంచవాగు ద్వారా వరద చేరుతోంది.