ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట

Aug 18 2025 5:35 AM | Updated on Aug 18 2025 5:35 AM

ఎస్సీ

ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట

● రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతం

● రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రీతం

సిరిసిల్లటౌన్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎస్సీ అభివృద్ధికి సర్కారు పెద్దపీట వేసిందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ నగరిగారి ప్రీతం పేర్కొన్నారు. గాంధీభవన్‌లో స్టేట్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్‌ రాజేందర్పాల్‌ గౌతమ్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు నాలుక సత్యం పాల్గొన్నారు.

‘డీజేలు ఏర్పాటు చేస్తే చర్యలు’

వేములవాడ: నిబంధలకు లోబడి వినాయక మండపాల వద్ద స్పీకర్లు ఏర్పాటు చేసుకోవాలే తప్ప డీజేలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని టౌన్‌ సీఐ వీరప్రసాద్‌ హెచ్చరించారు. టౌన్‌ పరిధిలోని డీజే నిర్వాహకులతో ఆదివారం స్టేషన్‌ ఆవరణలో సమావేశమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు పెట్టినా, యాంప్లిఫైయర్‌తో బాక్స్‌లు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో మండపాల వద్ద కానీ, శోభయత్రలో కానీ డీజేలు కానీ యాంప్లిఫయర్‌తో బాక్స్‌లు ఏర్పాటు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంక్షేమ పథకాలు వివరించాలి

సిరిసిల్లటౌన్‌: కాంగ్రెస్‌ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని రాజీవ్‌గాంఽధీ పంచాయతీరాజ్‌ సంఘటన జిల్లా అధ్యక్షుడు గుండెల్లి శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. డీసీసీ ఆఫీస్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆర్‌జీపీఆర్‌ఎస్‌ నేషనల్‌ కో–ఆర్డినేటర్‌ ఇనామ్‌ హసన్‌, స్టేట్‌ జోనల్‌ ఇన్‌చార్జి మోతుకూరి నవీన్‌గౌడ్‌ పాల్గొన్నారు.

యాదవుల శౌర్యం దేశభక్తికి నిదర్శనం

సిరిసిల్లటౌన్‌/తంగళ్లపల్లి(సిరిసిల్ల): దేశరక్షణలో యాదవుల శౌర్యం ఎనలేనిదని యాదవ మహాసభ రాష్ట్ర నాయకుడు వీరవేని మల్లేశ్‌యాదవ్‌ పేర్కొన్నారు. అఖిల భారత యాదవ మహాసభ చేపట్టిన రెజాంగ్ల రాజ్‌ కలశయాత్ర ఆదివారం సిరిసిల్లకు చేరిన సందర్భంగా వారికి స్వాగతం పలికి మాట్లాడారు. 1962 భారత–చైనా యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన 114 మంది యాదవ వీరయోధుల స్మరణార్థంగా, అహిర్‌(యాదవ్‌) రెజిమెంట్‌ స్థాపన కోసం బిహార్‌ నుంచి ప్రారంభమైన 120 రోజుల కలశ యాత్ర ఆదివారం సిరిసిల్ల వచ్చిందని తెలిపారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏటీ యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసరి బాలరాజు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జగ్గాన్ని మల్లేశ్‌యాదవ్‌, కార్యదర్శి మిరాల శ్రీనివాస్‌, మండలాధ్యక్షుడు మాసం భాస్కర్‌, ప్రధాన కార్యదర్శి గంధం సంపత్‌ పాల్గొన్నారు.

నేడు ప్రజావాణి రద్దు

సిరిసిల్ల/సిరిసిల్లఅర్బన్‌: కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా ప్రజలు వినతులు ఇవ్వడానికి కలెక్టరేట్‌కు రావద్దని కోరారు.

ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట
1
1/2

ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట

ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట
2
2/2

ఎస్సీల అభివృద్ధికి పెద్దపీట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement