
అప్పుడే ఎండ.. అప్పుడే వాన
పొద్దుగాల చూస్తే ఎండ వస్తుందని అనిపించి రంగులు అద్ది బట్టను ఆరబెడితే అప్పుడే మొగులు అవుతుంది. వర్షం పడుతుంది. ఆరినబట్ట తడిసిపోతుంది. మళ్లీ ఆరేంత వరకు అక్కడే ఉండాలే. ఇలా చేసిన రెక్కల కష్టం ముసురు వర్షంతో పాడవుతుంది. సరైన పని లేక.. కై కిలి రాక.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. – నల్ల లక్ష్మీనారాయణ,
డయింగ్ కార్మికుడు
ముసురు వర్షంతో అద్దకం ఆగిపోయింది. సిరిసిల్లలో అద్దకం పరిశ్రమ ఒకప్పుడు వెలుగు వెలిగింది. ఇప్పుడు ప్రభుత్వ సహకారం లేక డయింగ్ యూనిట్లు మూతబడిపోయి ఆఖరి దశకు చేరాయి. పాలిస్టర్ పరిశ్రమకు ఇచ్చినట్లు కాటన్ పరిశ్రమకు ప్రభుత్వ ఆర్డర్లు వస్తే బాగుంటుంది.
– కోడం ఆనంద్‌బాబు,
డయింగ్ యజమాని

అప్పుడే ఎండ.. అప్పుడే వాన