
ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యత
● సైకాలజిస్టు పున్నం చందర్
సిరిసిల్లటౌన్: ఆత్మహత్యల నివారణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని సైకాలజిస్టు పున్నంచందర్ పేర్కొన్నారు. జాతీయ సామాజిక వారోత్సవం 2025లో భాగంగా ఆదివారం కాకతీయ యూనివర్సిటీ సామాజికశాస్త్రం, సామాజిక సేవా విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఒక ప్రత్యేక వెబినార్ నిర్వహించి మాట్లాడారు. సోషల్‌వర్క్ విద్యార్థులకు ‘ఆత్మహత్య నివారణ పద్ధతులు’ అనే అంశంపై ఆన్‌లైన్‌లో మార్గదర్శనం చేస్తూ మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో యువతలో ఆత్మహత్య ప్రవర్తన పెరుగుతోందన్నారు. కుటుంబం, స్నేహితులు, అధ్యాపకులు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే అనేక ప్రాణాలను రక్షించవచ్చని సూచించారు. సామాజిక సంబంధాల నుంచి దూరమవడం, ఒంటరిగా ఉండడాన్ని ఇష్టపడటం అనే లక్షణాలు కనిపిస్తాయన్నారు. విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.స్వర్ణలత మాట్లాడుతూ సమాజంలో రోజురోజుకు సమస్యలతోపాటు సోషల్‌వర్క్ ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. సామాజికశాస్త్రం, సంఘ సంక్షేమశాస్త్రం బోర్డు ఆఫ్ స్టడీస్ ప్రొఫెసర్ ఎం.ఐలయ్య, అధ్యాపకులు డాక్టర్ కె.సుభాష్, డాక్టర్ ఎస్.సాహితి పాల్గొన్నారు.