
ఆవు, దూడకు బారసాల
బోయినపల్లి(చొప్పదండి): కృష్ణాష్టమిని పురస్కరించుకొని బోయినపల్లి మండల కేంద్రంలో ఆవుదూడకు బారసాల నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన సుంకపాక తార నర్సయ్య దంపతులకు చెందిన ఆవు 21 రోజుల క్రితం దూడకు జన్మనిచ్చింది. ఈక్రమంలో శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి బారసాల నిర్వహించారు. ఆవుకు, దూడకు పూలదండ వేసి అలంకరించారు.
కోనరావుపేట(వేములవాడ): మండల కేంద్రం శివారులో జరుగుతున్న కల్వర్టు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. గ్రామస్తులు మాట్లాడుతూ కల్వర్టులో వినియోగించే పైపుల మధ్య సిమెంట్, కాంక్రీట్‌తో నింపాల్సి ఉండగా రాళ్లు, బురదమట్టితో నింపుతున్నారన్నారు. వర్షాలకు వచ్చే వరదలకు బురదమట్టి కొట్టుకుపోయి కల్వర్టుకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్నారు. పైపుల మధ్య జాయింట్లు కూడా సరిగా చేయడం లేదన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి పనులు నాణ్యతతో జరిగేలా చూడాలన్నారు. జింక వెంకటి, కస్తూరి మధుకర్‌రెడ్డి, యాస రాజం, శివతేజరావు, మోహన్, జీవన్ తదితరులు ఉన్నారు.
కోనరావుపేట(వేములవాడ): వరుసగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. మండలంలోని వెంకట్రావుపేటలోని కేశవరావు చెరువు పూర్తిస్థాయిలో నిండింది. శనివారం మత్తడి దూకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బోయినపల్లి(చొప్పదండి): శ్రీరాజరాజశ్వేర(మిడ్‌మానేరు) ప్రాజెక్టులో నీటిమట్టం శనివారం రాత్రి 7 గంటల వరకు 9.989 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌస్ నుంచి వరదకాలువ మీదుగా 12,600 క్యూసెక్కుల మేర ఎల్లంపల్లి జలాలు వచ్చి చేరుతున్నాయి., అలాగే మూల వాగు, మానేరు వాగుల నుంచి మరో 380 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి తరలుతోంది. ఆదివారం ఉదయం వరకు ప్రాజెక్టులో నీటి నిల్వ 10 టీఎంసీలకు చేరనుంది.
బోయినపల్లి(వేములవాడ): జిల్లా సింగిల్‌విండో ఫోరం అధ్యక్షులు, కోరెం ప్యాక్స్ చైర్మన్ తీపిరెడ్డి కిషన్‌రెడ్డి, బోయినపల్లి ప్యాక్స్ చైర్మన్ జోగినిపల్లి వెంకట రామారావు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను శనివారం కలిశారు. సింగిల్‌విండోల పదవీకాలం పొడగించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించారు. సింగిల్‌విండో డైరెక్టర్లు అనుపట్ల తిరుపతిరెడ్డి, ఎర్రగడ్డం స్వామిరెడ్డి, డబ్బు రాధా వెంకటరెడ్డి, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి, రవి ఉన్నారు.

ఆవు, దూడకు బారసాల

ఆవు, దూడకు బారసాల

ఆవు, దూడకు బారసాల

ఆవు, దూడకు బారసాల