
సైకిల్‌పై తిరిగొద్దాం
ఇంటి నుంచి అడుగు బయటపెట్టడమే ఆలస్యం.. వాహనం ఎక్కి దూసుకెళ్తున్నాం. ప్రమాదానికి ఆస్కారం ఉందని తెలిసినా రహదారి నిబంధనలు పట్టించుకోం. మనస్థాయికి తగ్గ వాహనాలు ఉన్నా.. వాటికి అప్పుడప్పుడు విరామమిద్దాం. వారంలో కనీసం ఒక్కరోజు ఆఫీసుకే కాదు... చిన్నచిన్న అవసరాలకు సైకిల్‌పై వెళ్లొద్దాం. ఆరోగ్యంగా ఉందాం. ఫిట్‌నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్‌లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సైకిల్ తొక్కడంతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాం.
సెలవు దొరికితే సినిమా లేదా ఎగ్జిబిషన్‌కు వెళ్దామా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ ఆదివారం పిల్లలతో కలిసి సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లొద్దాం. రైతు పడుతున్న కష్టాన్ని తెలుసుకుందాం. పిల్లలకు సాగు పద్ధతులు తెలియచేద్దాం. చుట్టుపక్కల ఉన్న పచ్చదనంతో ఆహ్లాదంతో గడుపుదాం. ప్రకృతి విలువ అర్థమయ్యేలా వివరిద్దాం. ఇలా చేయడంతో గ్రూప్‌డిస్కషన్ జరుగుతుంది. పరిశీలించే గుణం పెరుగుతుంది. వాతావరణం, పంటలపై అవగాహన కలుగుతుంది. క్షేత్రస్థాయి అనుభవం వస్తుంది.

సైకిల్‌పై తిరిగొద్దాం