యూరియా లేదయా! | - | Sakshi
Sakshi News home page

యూరియా లేదయా!

Aug 13 2025 7:22 AM | Updated on Aug 13 2025 1:45 PM

రోడ్డెక్కుతున్న రైతులు 

కొరత లేదంటున్న అధికారులు 

రైతులకు అరకొరగానే పంపిణీ 

25వేల టన్నులు అవసరం 

వచ్చింది 11 వేల టన్నులు 

జిల్లాకు చేరింది సగం కోటానే !

చెప్పుల క్యూలైన్‌లు

రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూలో ఉన్నారు. తమ చెప్పులను వరుసగా పెట్టి యూరియా కోసం గంటల తరబడి ఎదురుచూశారు. ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి మండలాల్లోనూ ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లోనూ ఎరువుల కోసం రైతులు అనేక పాట్లు పడుతుంటే అధికారులు మాత్రం ఎరువుల కొరతే లేదని చెప్పడం విడ్డూరంగా ఉంది.

ముందస్తు ప్రణాళిక కరువు

కరీంనగర్‌, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సాగు అయ్యే పంటల విస్తీర్ణానికి అనుగుణంగా ఎరువుల నిల్వలను ముందుగానే అందుబాటులో ఉంచుకోవాల్సిన అధికారులు విఫలమైనట్లుగా భావిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో సాగయ్యే 1,84,860 ఎకరాల పంటలకు యూరియా 3,460 టన్నులు, డీఏపీ 22,390 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం ఉండగా ముందుస్తు ప్రణాళిక లేకనే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.

● కరీంనగర్‌ జిల్లాలో 3,34,127 ఎకరాల పంటలకు యూరియా 28,493 టన్నులు యూరియా అవసరం ఉండగా 13,732 టన్నులు మాత్రమే జిల్లాకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలో 1.90,850 ఎకరాలలో పంటలు సాగు కాగా 32,447 టన్నులు ఎరువులు అవసరం. కానీ జిల్లాకు ఇప్పటి వరకు 17,036 టన్నులు మాత్రమే వచ్చింది. జగిత్యాల జిల్లాలో 4,22,725 ఎకరాలలో పంటలు సాగవగా 34,679 టన్నులు ఎరువులు కావాలి. కానీ ఇప్పటి వరకు చేరింది 20,729 టన్నులు మాత్రమే. అంటే ఎక్కడ కూడా అవసరంలో సగం మాత్రమే ఎరువులు జిల్లాలకు చేరాయి.

రైతులు తొందరపడొద్దు

రైతులు తొందరపడొద్దు. అవసరాల మేరకు యూరియా ఉంది. ఇప్పుడు మార్కెట్‌లో 500 మెట్రిక్‌ టన్నుల మేరకు యూరియా సిద్ధంగా ఉంది. మొత్తం సీజన్‌కు అవసరమైన మేరకు తెప్పిస్తున్నాం. సిరిసిల్ల అపెరల్‌ పార్క్‌లో కలెక్టర్‌ చొరవతో కొత్తగా గోదాము ఏర్పాటు చేసి ఎరువులను నిల్వ చేస్తున్నాం. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటాం. – అఫ్జల్‌బేగం, జిల్లా వ్యవసాయాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement