
కిక్కిరిసిన బస్టాండ్
వేములవాడ బస్టాండ్‌లో ప్రయాణికులు
వేములవాడఅర్బన్: ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులు సోమవారం కిక్కిరిసిపోయారు. రాఖీపౌర్ణమి, ఆదివారం వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో పట్టణంలోని ప్రజలు పల్లెలకు చేరుకున్నారు. సోమవారం తిరుగు ప్రయాణంలో వేములవాడ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది.
టీఎస్‌ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీర్స్ అసోసియేషన్
సిరిసిల్ల సర్కిల్ ఇంజినీర్ల అసోయేషన్ ప్రతినిధులు
సిరిసిల్ల: టీఎస్‌ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా సర్కిల్ మిషన్ భగీరథ విభాగం ఇంజినీర్ల అసోసియేషన్ ఎన్నికలు సోమవారం జరిగాయి. అధ్యక్షుడిగా సి.విశ్వన్, ఉపాధ్యక్షుడిగా బి.అభిషేక్, ప్రధాన కార్యదర్శిగా ఎ.రామారావు, సంయుక్త కార్యదర్శిగా పి.హరిప్రియ, టెక్నికల్ కార్యదర్శిగా బి.శ్రీమాన్, మహిళా కార్యదర్శిగా ఎం.శ్రావ్యపటేల్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఈ.మధు, కోశాధికారిగా ఎన్.సాయికిరణ్ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా పి.హారిక వ్యవహరించారు.
హెచ్‌హెచ్‌ఆర్‌పీ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం
సిరిసిల్ల: ఆర్డీవో ఆఫీస్‌లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సోమవారం ప్రకటనలో తెలిపారు. హ్యాండ్ హోల్డింగ్ రిసోర్స్ పర్సన్(హెచ్‌హెచ్‌ఆర్‌పీ) ఒక్క పోస్టు ఉందని పేర్కొన్నారు. జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్ పొంది ఆన్‌లైన్‌లో ఈనెల 18లోగా దరఖాస్తు చేయాలని పేర్కొన్నారు. జిల్లాకు చెందిన బీటెక్(సీఎస్‌సీ), బీటెక్(ఐటీ), ఎంసీఏ చదివిన అభ్యర్థులు అర్హులని వివరించారు. కనీసం రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చిన రామలక్ష్మణపల్లి గ్రామస్తులు
సిరిసిల్లఅర్బన్: అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతూ ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లి గ్రామస్తులు సోమవారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. గ్రామ శివారు నుంచి చంద్రమౌళి అనే వ్యక్తి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నాడని, జేసీబీ సహాయంతో టిప్పర్లు, ట్రాక్టర్, పికాక్‌లు నింపుతూ అడ్డువచ్చిన వారిని బెదిస్తున్నాడని వారు ఆరోపించారు. ఇసుక రవాణా కోసం పాక అంజయ్య పొలం నుంచి ప్రత్యేకంగా రోడ్డు నిర్మించుకున్నారన్నారు. రవీందర్, ఎల్లయ్య, రాజు, రాజశేఖర్, రాములు, మాఽ దవి, పద్మ, మౌనిక తదితరులు పాల్గొన్నారు.

కిక్కిరిసిన బస్టాండ్

కిక్కిరిసిన బస్టాండ్