
వాగుల్లో జలధారలు
సిరిసిల్ల: వర్షాకాలం సీజన్‌లో సమృద్ధిగా వానలు కురువలేదు. జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి పెద్దగా నీరు చేరలేదు. రెండు, మూడు రోజులుగా జిల్లాలో అడపాదడపా కురిసిన వానలకు సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగుల్లో నీటిపాయలు సాగుతున్నాయి. నర్మాల ఎగువ మానేరు, నిమ్మపల్లి మూలవాగు జలాశయాలు అలుగు పారలేదు.. కానీ పడువాటు నీళ్లతో మానేరు, మూలవాగుల్లో సోమవారం నీటి ధారలు సాగాయి. వాగుల్లో నీరు పారితే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయి. మరో రెండు, మూడు గట్టి వానలు పడితే జలాశయాలు నిండి వాగులు పారేందుకు ఈ నీటిధారలు సూచిక. పడువాటు నీటితోనే వాగుల్లో జలసిరులు పరుగు తీయడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. జిల్లాలోని ప్రధానమైన వాగుల్లో సోమవారం కనిపించిన దృశ్యాలు ఇవీ..

వాగుల్లో జలధారలు