
సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
హైదరాబాద్‌లో చర్చించిన
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హాజరైన నీటిపారుదల శాఖ అధికారులు
వేములవాడ: నియోజకవర్గంలోని ప్రాజెక్టుల పురోగతిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్ కలికోట నుంచి కుడి, ఎడమ కాల్వల నిర్మాణ పనులు, కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ ఎడమ కాలువ కోసం భూసేకరణ, వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి ప్రాజెక్టు పనులు, కోనరావుపేట మండల పరిధి లోని లచ్చాపేటతండా రిజర్వాయర్ కాలువ పనులు, చందుర్తి మండల పరిధిలోని ఆశిరెడ్డిపల్లి కొచ్చెరువు, సనుగుల ఎర్ర చెరువు పటేల్ చెరువులోకి నీటిని నింపే ఏర్పాట్లపై చర్చించారు. ప్రాధాన్యత ను దృష్టిలో పెట్టుకుని, రైతులకు సాగునీరు సకా లంలో అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పె ట్టుకుని మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ సంతు ప్రకాశ్, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.