
ప్రజా సమస్యల సాధనకు పోరాటం
● బీజేపీ పట్టణాధ్యక్షుడు దుమాల శ్రీకాంత్
సిరిసిల్లటౌన్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పోరాటం చేస్తోందని ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని 23వ వార్డులో ఆదివారం పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ‘ఇందిరమ్మ పథకం’ పేరుతో ఇల్లు ఇస్తున్నామని చెబుతున్నారు కానీ ఇసుక లేకుండా నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రెండేళ్లలో ఎన్నిసార్లు ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాడని ప్రశ్నించారు. జనాలకు అందుబాటులో లేకుండా, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వస్తున్నాడని విమర్శించారు.
హర్ ఘర్ తిరంగాతో జాతీయభావం పెంపు
● బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్
చందుర్తి(వేములవాడ): ప్రజల్లో జాతీయభావం పెంపొందించుటకే బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున పేర్కొన్నారు. చందుర్తిలో భగత్‌సింగ్ చిత్రపటానికి ఆదివారం పూలమాలలు వేసి, జాతీయ జెండా ఎగురవేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మార్త సత్తయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మోకిలే విజేందర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పోంశెట్టి రాకేశ్, మండల ప్రధాన కార్యదర్శులు మర్రి మల్లేశం, పెరుక గంగరాం, సేరుక గంగరాజు, మొత్కపల్లి రాజశేఖర్, మట్కం మల్లేశం, చింతకుంట సాగర్ పాల్గొన్నారు.
పాలిటెక్నిక్‌లో స్పాట్ అడ్మిషన్లు
వేములవాడఅర్బన్: అగ్రహారం శ్రీరాజరాజేశ్వరస్వామి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రవేశం పొందుటకు చివరి అవకాశం ఈనెల 11 వరకు ఉందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరాచారి తెలిపారు. డిప్లామా మెకానికల్ ఇంజినీరింగ్, డిప్లామా టెక్స్‌టైల్ టెక్నాలజీ, ఫ్యాషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్‌లో సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ అవకశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రూ.6 వేలు ఫీజు తీసుకుని కళాశాలకు రావాలని సూచించారు.
రాజన్నకు రూ.2లక్షల విరాళం
వేములవాడ: రాజన్నకు భక్తుల నుంచి రూ.2 లక్షల విరాళం ఆదివారం ఆలయ ఏఈవో అశోక్, ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్‌చారీలకు అందజేశారు. గోశాల సంరక్షణ ట్రస్ట్‌కు సిద్దిపేట జిల్లాకు చెందిన వంగ రాజేశ్వర్‌రెడ్డి తన కుమార్తె ఆర్తిరెడ్డి పేరిట రూ.లక్ష అందించారు. నిత్యాన్నదాన సత్రానికి రూ.లక్షను హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగి కట్టంగూర్ రాజవంశీధర్‌రెడ్డి కుటుంబ సభ్యులు విరాళంగా అందజేశారు.

ప్రజా సమస్యల సాధనకు పోరాటం