
ప్రభుత్వ ఆఫీస్‌లపై సోలార్ ప్యానెల్స్
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలోని ప్రభుత్వ ఆఫీస్‌లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్ నుంచి శనివారం మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. గ్రామపంచాయతీ నుంచి కలెక్టరేట్ వరకు అన్ని ఆఫీస్‌లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వీడియో కాన్ఫరెన్స్‌లో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుపై సమీక్షించారు.
జిల్లాలో ఎరువులకు కొరత లేదు
జిల్లాలో ఎరువుల కొరత లేదని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో ఎరువుల కొరత ఉందని గంటల తరబడి రైతులు వేచి చూసి ఇబ్బంది పడుతున్నారని జరిగిన ప్రచారాన్ని ఖండించారు. కొందరు కావాలనే రైతులతో మాట్లాడించి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సిరిసిల్ల శివారులోని అపెరల్ పార్క్‌లో గోదాము ఏర్పాటు చేశామని వివరించారు.