
వైభవంగా యజ్ఞోపవీతధారణ
నాగిరెడ్డి మండపంలో యజ్ఞోపవీత ధారణలో యజుర్వేద బ్రాహ్మణులు
వేములవాడ: శ్రావణమాసం.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని రాజన్న ఆలయంలో రుగ్వేద, యజుర్వేద బ్రాహ్మణులు శనివారం యజ్ఞోపవీతధారణ నిర్వహించారు. ప్రత్యేక హోమం జరిపిన తర్వాత శ్రావణ నక్షత్రం సందర్భంగా రుగ్వేదులు అద్దాల మంటపంలో, పౌర్ణమి తిథి అనుసారం నాగిరెడ్డి మంటపంలో యజుర్వేదులు ఉపాకర్మ నిర్వహించి సామూహికంగా నూతన యజ్ఞోపవితధారణ గావించారు. అయితే ఈసారి రుగ్వేదులు, యజుర్వేదులకు ఒకే రోజు కలిసి రావడంతో ఆలయం బ్రాహ్మణులతో సందడిగా మారింది. మార్కండేయనగర్‌లో స్థానిక పద్మశాలీ కులస్తులు నూతన జంధ్యాలు ధరించారు.