● కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి
ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి కోరారు. ముస్తాబాద్, తంగళ్లపల్లి మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించిన ‘జైబాపు.. జై భీమ్.. జై సంవిధాన్’లో మాట్లాడారు. పౌరహక్కులు, ప్రాథమిక హక్కులను హరించేలా కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందన్నారు. ప్రజ ల మధ్య కుల, మత చిచ్చుపెట్టి విడదీసి పాలన చేస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశా రు. జైబాపు, జై భీమ్ ముస్తాబాద్ ఇన్‌చార్జి నాగం కుమార్, జిల్లా ఇన్‌చార్జి ఆవాజ్, కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు యెల్ల బాల్‌రెడ్డి, ప్రవీణ్ జే టోని, పట్టణాధ్యక్షుడు గజ్జెల రాజు, ఏఎంసీ చైర్‌పర్సన్‌లు తలారి రాణి, నేరెళ్ల నర్సింగంగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ అన్నం రాజేందర్‌రెడ్డి, వైస్‌చైర్మ న్ రాంరెడ్డి, నాయకులు చిలుక రమేష్, హజీజ్, చుక్క రాజశేఖర్, ఆరెపల్లి బాలు పాల్గొన్నారు.


