సాక్షిప్రతినిధి, కరీంనగర్: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూ
ఎలా తరలిస్తారు?
గుజరాత్ పోరుబందర్‌కు చెందిన హితేశ్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన రాజశేఖర్ ఈ మానవ అక్రమ రవాణాలో కింగ్‌పిన్‌లని పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థలు ఇప్పటికే గుర్తించాయి. మార్చి 10, 11 తేదీల్లో బాధితులను మయన్మార్‌లోని మైవాడీ జిల్లా నుంచి థాయ్‌లాండ్‌లోని మైసోట్ నగరానికి, ఆ పై మన దేశ రాజధాని ఢిల్లీకి తరలించాయి. అక్కడ నుంచి వచ్చిన బాధితుల ద్వారా సీబీఐ, ఎన్‌ఐఏ, రాష్ట్రానికి చెందిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ)లు మోసం ఎలా జరిగిందో వివరాలు రాబట్టాయి. ఆయా ఏజెన్సీలకు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం విదేశాల్లో కొలువుల కోసం చూస్తున్న అమాయకులకు తొలుత టెలీగ్రామ్ యాప్‌లో లింకులు పంపుతారు. అనంతరం వీరికి జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ, టైపింగ్ స్పీడ్ పరీక్షించి ఎంపిక చేస్తారు. వీరినుంచి రూ.3లక్షల వరకు ఉద్యోగం ఇచ్చినందుకు వసూలు చేస్తారు. ఇవ్వని వారినీ ఏమీ అనకుండా ఉచితంగా విమాన టికెట్ పంపుతారు. తీరా థాయ్‌లాండ్ వెళ్లాక..అక్కడ అవసరాన్ని బట్టి.. మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్‌లకు సరఫరా చేస్తారు. పాస్‌పోర్టు లాక్కుని సైబర్ నేరాలు చేయాలని చిత్రహింసలకు గురిచేస్తారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: పిల్లలకు ఏదోమాయ చెప్పి.. బూ


