● మార్కెట్‌లో నాణ్యత లేని వస్తువుల విక్రయం ● తూకంలోనూ తేడాలు ● అధికారుల తనిఖీలు కరువు ● నేడు వినియోగదారుల దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

● మార్కెట్‌లో నాణ్యత లేని వస్తువుల విక్రయం ● తూకంలోనూ తేడాలు ● అధికారుల తనిఖీలు కరువు ● నేడు వినియోగదారుల దినోత్సవం

Mar 15 2025 12:12 AM | Updated on Mar 15 2025 12:12 AM

● మార

● మార్కెట్‌లో నాణ్యత లేని వస్తువుల విక్రయం ● తూకంలోనూ త

సిరిసిల్లకల్చరల్‌: మార్కెట్‌లో అడుగడుగునా మోసాలే. తూకం నుంచి మొదలుపెడితే వస్తువు నాణ్యత వరకు అంతా ౖపైపె మెరుగులే. వ్యాపారం చేసేందుకు ప్రసారం చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా వస్తువుల నాణ్యత ఉండడం లేదు. నిర్ధిష్ట పరిణామాల ప్రకారం వస్తువులు సైతం లభించడం లేదు. ఫలితంగా వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. అవగాహన లేక వినియోగదారులు తమ హక్కుల కోసం పోరాడడం అటుంచితే కనీసం ప్రశ్నించడం లేదు. మార్కెట్‌లో దొరికిందే వస్తువు.. చెప్పిందే ధరగా నడుస్తోంది. వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మార్కెట్‌లో జరుగుతున్న మోసాలపై ‘సాక్షి’ ఫోకస్‌.

ఆన్‌లైన్‌ మోసాలు.. ఆధునిక చట్టాలు

నాణ్యమైన వస్తువులు సరఫరా చేయడం తయారీదారుడి బాధ్యత.. లోపం లేని వస్తు సేవలు పొందడం కొనుగోలుదారుడి ప్రధాన హక్కు. అయితే ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు కొనుగోలుదారులను మోసం చేస్తూనే ఉన్నారు. అయితే నష్టపోయిన వినియోగదారులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 1986లో వినియోగదారుల చట్టం తీసుకొచ్చింది. కాలక్రమేన వ్యాపార సరళిలో మార్పులు వచ్చాయి. ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు పెరిగిపోయాయి. కొత్త రకం మోసాలకు తెరలేచిన వేళ 2019లో దీనికి అనుబంధంగా మరో కొత్త చట్టాన్ని అమలు చేసింది. అక్రమ వాణిజ్య పద్ధతులు, మోసపూరిత ప్రకటనలపై కొరడా ఝుళిపించేలా చట్టాలను రూపొందించింది. వినియోగదారుల రక్షణ మండళ్లు, మధ్యవర్తిత్వ ప్యానెళ్ల ఏర్పాటుతోపాటు ఈ–మెయిల్‌ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, వీడియో కాన్ఫరెన్స్‌లో కేసుల పరిష్కారం వంటి కొత్త విధానాలను పొందుపరిచింది.

వినియోగదారుల ఫోరాన్ని ఇలా ఆశ్రయించాలి

కొన్న వస్తువులో నాణ్యతలోపం, సేవల్లో నిర్లక్ష్యం, తూకంలో తేడా, నకిలీవస్తువు.. అని గుర్తించిన పక్షంలో సదరు వ్యాపారీపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. రూ.20లక్షలలోపు పరిహారానికి జిల్లా ఫోరంలో, రూ.కోటి లోపు రాష్ట్ర ఫోరంలో, అంతకుమించి పరిహారం కోసం జాతీయ కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

జిల్లాలో జాడ లేని వినియోగదారుల కమిషన్‌

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పడిన జిల్లాల్లో వినియోగదారుల కమిషన్‌ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. ఇప్పటికీ కొత్త జిల్లాల్లో కమిషన్‌లు లేవు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉన్న ఫోరం కమిషన్‌గా పరిణామం చెందింది. కానీ నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. ఏళ్లుగా కమిషన్‌కు చైర్మన్‌ను నియమించలేదు. కమిషన్‌లో సరిపడినంత సిబ్బంది లేరు. ఇప్పటికీ 720 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సగటున నెలకు 21 నుంచి 25 కేసులు నమోదవుతున్నాయి.

చట్టంపై అవగాహన పెంచాలి

వినియోగదారుల హక్కులను రక్షించేందుకు రూపొందించిన చట్టంపై మొదట్లో కొంత ప్రచారం జరిగింది. కానీ కొన్నేళ్లుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. అవగాహన పెంచాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేకంగా రక్షణ మండళ్లను ఏర్పాటు చేయాలి. చట్టంపై అవగాహన పెంచేందుకు ప్రచార కార్యక్రమాలు రూపొందించాలి. వ్యాపార సంస్థల్లో సంబంధిత అధికారులు తరచూ తనిఖీలు చేపట్టాలి. ప్రజలు కూడా ఈ చట్టాన్ని వినియోగించుకునేందుకు ముందుకు రావాలి.

– బియ్యంకార్‌ శ్రీనివాస్‌,

పౌర సంక్షేమ సమితి అధ్యక్షుడు

అంతా కనికట్టు.. మోసం కనిపెట్టు

ఓవైపు పెట్రోలు కల్తీ ..మరోవైపు కొలతల్లో తేడాలు...అంతేకాకుండా కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం.. ఇదీ ఉమ్మడి జిల్లాలో అధిక శాతం పెట్రోలు బంకుల్లో పరిస్థితి. ఎక్కడా నిబంధనలు పాటించిన దాఖలాలు కనిపించవు. త్వరగా గమ్యం చేరాలనే వినియోగదారుడి ఆరాటం..అవగాహన లోపం.. బంకుల యాజమాన్యాలకు కలసివస్తోంది. 8లోu

● మార్కెట్‌లో నాణ్యత లేని వస్తువుల విక్రయం ● తూకంలోనూ త1
1/2

● మార్కెట్‌లో నాణ్యత లేని వస్తువుల విక్రయం ● తూకంలోనూ త

● మార్కెట్‌లో నాణ్యత లేని వస్తువుల విక్రయం ● తూకంలోనూ త2
2/2

● మార్కెట్‌లో నాణ్యత లేని వస్తువుల విక్రయం ● తూకంలోనూ త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement